![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -161 లో... చందుకి శ్రీవల్లి లంచ్ తీసుకొని వెళ్తుంది. శ్రీవల్లి బాక్స్ తీసుకొని రావడంతో చందు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువు తిన్నావా అని చందు అనగానే మీరు తినకుండా నేనెలా తింటానని శ్రీవల్లి అనగానే ఇలాంటి భార్య దొరకడం చాలా అదృష్టమని చందు మురిసిపోతాడు.
ధీరజ్ ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరి అందరికి ఫుడ్ డెలివరీ చేస్తుంటాడు. కొంతమంది డెలివరి లేట్ అయిందని కోప్పడుతుంటాడు. తనకి కోపం వచ్చినా కూడా ఏం అనలేకపోతాడు. తను అప్పుడు జీవితం అంటే ఏంటో రియలైజ్ అవుతాడు. మరొకవైపు తిరుపతి దగ్గరికి ప్రేమ వచ్చి తనతో కూల్ గా మాట్లాడుతుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. బాబాయ్ నీ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడి ట్యూషన్ కి వచ్చేలా చెయ్యమని తిరుపతిని ప్రేమ అడుగుతుంది. చూసావా అందుకే ప్రేమ నీతో ఇప్పటివరకు ఇలా మాట్లాడిందని ధీరజ్ అంటాడు.
మరొకవైపు నర్మద, సాగర్ ఇద్దరు రూమ్ కి చేరుకుంటారు. కాళ్ళు నొప్పిగా ఉన్నాయని నర్మద అనగానే సాగర్ కాళ్ళు నొక్కుతాడు. ఆ తర్వాత ఈ నర్మద వస్తువులు ఎక్కడ పెట్టిందో ఏమోనని ప్రేమతో అంటుంది వేదవతి. ఫోన్ చేసి అడగండి అని ప్రేమ అనగానే వేదవతి ఫోన్ చేసి నర్మదతో మాట్లాడుతుంది. తరువాయి భాగంలో ధీరజ్, నేను ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం.. నాకు అల్ ది బెస్ట్ చెప్పమని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |